అక్టోబర్ నెలలో 21 రోజులు బ్యాంకులు సెలవు..!

-

బ్యాంక్ లో మనకి ముఖ్యమైన పనులు ఉంటాయి. సమయానికి పూర్తి చేసుకోవాలని అనుకునే సరికి బ్యాంక్ సెలవు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక బ్యాంకులు ఏయే రోజులు సెలవు అనేది ముందే తెలుసుకోవాలి.

ఇక ఇది ఇలా ఉంటే వచ్చే నెల అనగా అక్టోబర్ నెలలో బ్యాంకులకు 21 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. అయితే ఎప్పుడు, ఏ చోట సెలవో ఇప్పుడే చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 21 రోజుల సెలవుల్లో పబ్లిక్ హాలిడేస్ కూడా వున్నాయి.

అక్టోబర్ 1 – బ్యాంక్‌ అకౌంట్ల అర్ధ సంవత్సర ముగింపు
అక్టోబర్ 2 – ఆదివారం మరియు గాంధీ జయంతి
అక్టోబర్ 3 – దుర్గ పూజ
అక్టోబర్ 4 – దుర్గా పూజ లేదా దసరా/ ఆయుధ పూజ/శ్రీమంత శంకర దేవుని జన్మోత్సవం
అక్టోబర్ 5 – విజయదశమి/ శ్రీమంత శంకర దేవుని జన్మోత్సవం
అక్టోబర్ 6 – దుర్గ పూజ (Dashain)
అక్టోబర్ 7 – దుర్గ పూజ (Dashain)
అక్టోబర్ 8 – రెండవ శనివారం, మిలాద్-ఇ-షెరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ
అక్టోబర్ 9 – ఆదివారం
అక్టోబర్ 13 – కర్వా చౌత్
అక్టోబర్ 14 – ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత శుక్రవారం
అక్టోబర్ 16 – ఆదివారం
అక్టోబర్ 18 – కటి బిహు
అక్టోబర్ 22 – నాల్గవ శనివారం
అక్టోబర్ 23 – ఆదివారం
అక్టోబర్ 24 – కాళీ పూజ/దీపావళి/నరక చతుర్దశి
అక్టోబర్ 25 – లక్ష్మి పూజ, దీపావళి
అక్టోబర్ 26 – గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవత్ కొత్త సంవత్సరం రోజు/భాయ్ బిజ్/భాయ్ దుజ్/దీపావళి
అక్టోబర్ 27 – భైదూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చక్కూబా
అక్టోబర్ 30 – ఆదివారం
అక్టోబర్ 31 – సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పుట్టిన రోజు/ సూర్య పష్టి దాలా ఛత్.

Read more RELATED
Recommended to you

Latest news