ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు శుభవార్త..ఎఫ్‌డీ రేట్ల పెంపు..

జూన్ నెల నుంచి బ్యాకింగ్ వ్యవస్థలో పూర్తీ మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే..కొన్ని బ్యాంకులు కొన్ని రూల్స్ మార్చాయి. ఈ మేరకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఎఫ్‌డీ రేట్ల పెంపు పై ప్రకటన ఇచ్చింది.మంగళవారం నుంచి అంటే జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చింది.బ్యాంక్ లో 2-5 కోట్లు కలిగిన డిపాజిట్స్ కు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తుందన్నారు..జూన్ 7, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.2 కోట్ల కంటే ఎక్కువ.. రూ. 5 కోట్ల వరకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

 

7 రోజుల నుంచి 14 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం వడ్డీ లభిస్తుంది. అదే విధంగా 15 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం వడ్డీ అందుతుంది.30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం, ఇక 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం, 61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం,91 రోజుల నుంచి 120 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం ఉండనుంది..121 రోజుల నుంచి 150 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం,151 రోజుల నుంచి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం,185 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం ఉందని తెలుస్తుంది.

211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం ఉండగా, 271 రోజుల నుంచి 289 రోజులు వరకు సాధారణ ప్రజలకు 4.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.70 శాతం290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు 4.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.70 శాతం వడ్డీ లభిస్తుంది.1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు 4.95 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.95 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 4.95 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.95 శాతం, 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 5.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం,18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం ఉంది.

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం, 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం ఉండగా, 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం వడ్డీ బ్యాంక్‌ చెల్లిస్తుంది. ఈరోజు ఆర్‌బీఐ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఐసీఐసీఐతో సహా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను త్వరలోనే మళ్లీ పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.