ఆ బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్..

-

జూలై ఒకటి నుంచి బ్యాంక్ రూల్స్ మారిన సంగతి తెలిసిందే..కొన్ని ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లుపెంచాయి..మరి కొన్ని బ్యాంకులు వడ్డీని తగ్గించాయి.ప్రస్తుతం ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులన్నీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతుతున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మీరు మునుపటి కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు.

ఈ కొత్త రేట్లు జూలై 4 నుండి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో FD రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. మీరు ఒకటి నుండి మూడు సంవత్సరాల ఎఫ్‌డిలను పరిశీలిస్తే మెచ్యూరిటీని 10 నుండి 20 బేసిస్ పాయింట్లు పెంచారు. రిజర్వ్ బ్యాంక్ తన పాలసీ రేటును పెంచినప్పటి నుండి, గృహ రుణ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో FD, రికరింగ్ డిపాజిట్ వడ్డీలో పెరుగుదల ఉంది. జూలై, ఆగస్టు నెలల్లో కూడా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.జూన్ లో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈ చర్య తీసుకున్నారు. రెపో రేటు పెరుగుదల కారణంగా బ్యాంకులు రుణం రుణ రేటును పెంచాయి.దీంతో హోమ్ లోన్ ల పై వడ్డీ రేటు మరింత పెరిగింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు..

7 నుండి 14 రోజుల FDలపై, 3 శాతం, సీనియర్ సిటిజన్లు 3.5 శాతం వడ్డీని పొందుతున్నారు. 15 నుండి 29 రోజుల FDలపై, సాధారణ డిపాజిటర్ 3 శాతం, సీనియర్ సిటిజన్లు 3.5 శాతం వడ్డీని పొందుతున్నారు. అదేవిధంగా 30 నుండి 45 రోజుల FDలపై వడ్డీ రేటు కూడా అదే విధంగా ఉంటుంది. 46 నుండి 90 రోజులకు సాధారణ కస్టమర్లకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం వడ్డీ లభిస్తుంది. 91 నుండి 179 రోజుల మెచ్యూరిటీ ఉన్న FDలపై 4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 4.5 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది.

180 రోజుల నుండి 270 రోజుల FDలకు 4.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 5 శాతం, ఇక 271 నుండి 1 సంవత్సరం FDలకు 4.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 5 శాతం, 1 సంవత్సరం FDలకు 5.3 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 5.8 శాతం, 1 నుండి 2 సంవత్సరాల FDలకు 5.3 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 5.8 శాతం, 2 నుండి 3 సంవత్సరాల FDలపై సీనియర్ సిటిజన్లకు 5.5 శాతం నుంచి 6 శాతం వడ్డీ పెరిగింది..

Read more RELATED
Recommended to you

Latest news