కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్..ఎఫ్డీలపై వడ్డీ రేట్ల పెంపు..

-

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మరోసారి కస్టమర్లకు గుడ్ న్యూస్ ను చెప్పింది.టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. జూన్ 28 అంటే ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. రేట్ల పెంపు నేపథ్యంలో బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇకపై డబ్బులు ఎఫ్డీ చేస్తే అధిక రాబడి లభిస్తుంది.

 

అయితే,ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.1 శాతం నుంచి 5.7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్డీలపై బ్యాంక్ 3.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితిలోని ఎఫ్డీలపై 3.25 శాతం వడ్డీని పొందొచ్చు. 46 రోజుల నుంచి 60 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీ వస్తుంది. 61 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 4 శాతంగా కొనసాగుతోంది..

అదే విధంగా..91 రోజుల నుంచి 184 రోజుల ఎఫ్‌డీలపై 4.75 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఇంకా 185 రోజుల నుంచి 270 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీ వస్తోంది. ఇకపోతే 271 రోజుల ఎఫ్‌డీలపై 5.25 శాతం వడ్డీ ఉంది. ఏడాది టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ వస్తుంది. 18 నెలల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 5.7 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. కాగా బ్యాంక్ జూన్ 22న రూ. 2 కోట్లకు లోపు ఎఫ్‌డీలపై కూడా వడ్డీ రేట్లను సవరించింది. వీటిపై 2.75 శాతం నుంచి 5.75 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. అదే సీనియర్ సిటిజన్స్‌కు 3.25 నుంచి 6.5 శాతం లభిస్తుంది..ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను పెంచడం వల్ల బ్యాంకులు కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వరకూ పలు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి.

Read more RELATED
Recommended to you

Latest news