బఠిండా మిలిటరీ స్టేషన్ ఘటన.. నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే

-

పంజాబ్​లోని బఠిండా మిలిటరీ స్టేషన్​లో ఇటీవల కాల్పుల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పంజాబ్​ పోలీసులు ఇవాళ ఉదయం నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ కేసులో మొదట తమను తప్పుదోవ పట్టించిన సైనికుడై కాల్పులకు పాడ్డాడని బఠిండా సీనియర్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీసు గుల్నీత్‌ సింగ్‌ ఖురానా వెల్లడించారు. ఈ మేరకు సైనిక స్థావరంలో గన్నర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌ దేశాయ్‌ అనే సైనికుడిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. ‘‘వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడని.. మృతి చెందిన జవాన్లతో ఇతడికి(దేశాయ్‌ మోహన్‌) వ్యక్తిగత వైరం ఉందని ఎస్‌ఎస్పీ పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 12వ తేదీ తెల్లవారుజామున బఠిండా సైనిక స్థావరంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పంజాబ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మేజర్‌ అషుతోశ్‌ శుక్లా వాంగ్మూలం ఆధారంగా పంజాబ్‌ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆదివారం నలుగురు అనుమానిత జవాన్లను అదుపులోకి తీసుకుని విచారించగా అందులో.. మోహన్‌ దేశాయ్‌ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news