టీమిండియా శ్రీలంక టూర్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

-

జులై నెల చివర్లో టీమ్ ఇండియా టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. బీసీసీఐ గురువారం ఇట్టూరు కి సంబంధించిన షెడ్యూల్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.ఈ నెల 26 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 26న తొలి టీ20 జరగనుండగా.. 27వ, 29వ తేదీల్లో మిగతా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు పల్లెకెల ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి.

అలాగే, ఆగస్టు 1వ, 4వ, 7వ తేదీల్లో వన్డే మ్యాచ్‌లు కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్నాయి.ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్లుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌తో టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2021లో భారత జట్టు చివరిసారిగా శ్రీలంకలో పర్యటించగా , ఇండియా వన్డే సిరీస్‌ను 2-1తో దక్కించుకోగా.. టీ20 సిరీస్‌ను శ్రీలంక నెగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news