రమణీయ దృశ్యం.. అనంతపద్మనాభస్వామి ఆలయంపై సంధ్యా రవికిరణం

-

కొన్నిసార్లు ప్రకృతి చేసే అద్భుతాలు మనసుకు హాయిని కలిగిస్తాయి. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ ఆధ్యాత్మికతకు ప్రకృతి విన్యాసం తోడైతే ఆ దృశ్యాలు చూడటానికి రెండు కళ్లు చాలవు. అచ్చం ఇలాంటి దృశ్యమొకటి కేరళలోని ఓ ప్రసిద్ధ ఆలయంపై కనువిందు చేసింది. సంధ్యాసమయాన భక్తులను పులకరింపజేసింది.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ పద్మనాభస్వామి ఆలయ ప్రధాన రాజగోపురంపై శుక్రవారం సాయంత్రం ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాయం సంధ్యవేళ సూర్యబింబం చేసిన విన్యాసాలు అబ్బురపరచాయి. అస్తమయం అవుతున్న సూర్యుడు కొన్ని నిమిషాల తేడాలో రాజగోపురానికి చెందిన అయిదు అంతస్తుల గవాక్షాల నుంచి తన కిరణాలను ప్రసరిస్తూ కనువిందు చేశాడు. ఈ అపురూప కమనీయమైన దృశ్యాన్ని స్థానికులు, భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. తమ కళ్ల నిండా ఈ అద్భుత దృశ్యాన్ని నింపుకున్నారు. మనసారా ఈ ప్రకృతి విన్యాసాన్ని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news