పురుషులో మీరు కూడా అందంగా ఉండాలని అనుకుంటున్నారా..? మీ అందాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి… ఇలా చేస్తే చక్కగా అందంగా ఉంటారు. పైగా మీ అందం ని రెట్టింపు చేసుకోవచ్చు చర్మ సమస్యలు ఏమి ఉండవు ఎప్పుడు కంటే మరింత అందంగా కనబడతారు. వేసవిలో ఎండ వలన అందం పాడవుతుంది అందంపై ఎంత శ్రద్ధ వహించినా కూడా అందంగా కనపడడానికి అవ్వదు.
వేసవిలో స్కిన్ మీద శ్రద్ధ తప్పక పెట్టాలి. వేసవిలో సూర్యకిరణాల వలన ఇబ్బంది పడకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ లోషన్ ని అప్లై చేసుకోండి. యువి కిరణాల వలన చర్మం పాడవుతుంది సో తప్పక రాసుకోండి. పురుషులు అందంగా కనపడాలన్నా చర్మం పాడవకుండా ఉండాలన్నా సన్ గ్లాసెస్ ని టోపీని ధరించండి ఇవి ధరించడం వలన అందంగా కనపడచ్చు. అందం తరిగిపోదు. రక్షణ లభిస్తుంది.
చెమట, మురికి, జిడ్డు మొదలైన వాటి వలన చర్మ రంధ్రాలు మూసుకుపోతూ ఉంటాయి రోజుకి రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి అప్పుడు మీ అందం పాడవదు. చర్మం పాడవకుండా డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే తగినన్ని నీళ్లు కూడా తీసుకోండి. మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవడం వలన కూడా ఎంతో మేలు కలుగుతుంది లైట్ వెయిట్ ఫ్రీ
మాయిశ్చరైజర్ ని వాడాలి ఇలా మీ చర్మాన్ని అందంగా ఉంచుకోవచ్చు.
స్క్రబ్ చేయడం వలన చర్మం లోని మృత కణాలు పూర్తిగా పోతాయి వారానికి రెండుసార్లు ఫేషియల్స్ స్క్రబ్ని వాడొచ్చు. పెదాలు మీద కూడా ధ్యాస పెట్టండి. లిప్ బామ్ ని ఉపయోగించండి. వీటన్నిటితో పాటు జీవనశైలి కూడా బాగుండాలి రక్తప్రసరణ పెరిగి చర్మం అందంగా కనపడాలంటే వ్యాయామం చేయండి పండ్లు కూరగాయల్ని డైట్లో చేర్చుకోండి.