బెదురులంక 2012 రిలీజ్‌ అప్పుడేనట.. చెప్పేసిన మేకర్స్‌

-

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా సినిమా ‘బెదురు లంక 2012’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సి.యువరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన ‘బెదురులంక 2012’ సినిమాను ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు.

కార్తికేయ ఫేస్‌ మాస్క్‌ల కుప్పపై నిలబడ్డ లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్‌ సింగిల్ వెన్నెల్లో ఆడపిల్ల పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథాంశంతో వస్తున్న బెదురులంక 2012 చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సంగీతం అందిస్తున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news