స్కీముల పేరిట జనాలకు వల.. దేశవ్యాప్తంగా 7 వేల మందికి కుచ్చుటోపీ

-

ఒక ముఠా ఘజియాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతోందని చెప్పారు సీపీ సీవీ ఆనంద్. హెర్బల్ ప్రాడక్ట్స్ పేరుతో దేశవ్యాప్తంగా 7 వేల మందిని ఈ ముఠా సభ్యులు మోసం చేశారని కుండబద్దలు కొట్టారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.200 కోట్ల వరకు వీళ్లు దోచుకున్నారని షాకింగ్ వివరాలు బయటపెట్టారు. చట్ట ప్రకారం.. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్‌లు నేరమన్నారు. అయితే.. ఈ ముఠా సభ్యులు హెర్బల్ ప్రాడక్ట్స్ పేరుతో, అమాయకుల్ని మోసం చేశారని, వారి నుంచి దారుణంగా భారీ మొత్తం దోచుకున్నారని చెప్పారు.

Hyderabad: After CI Molestation Case CP CV Anand Transfers 69 Inspectors -  Sakshi

“పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ పేరుతో ఉన్న స్కీమ్ ప్రకారం రూ.6 లక్షలు కట్టిన వారికి 30 నెలల పాటు నెలకు రూ.30 వేలు చెల్లిస్తామని ఆశ చూపారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్ ప్రకారం రూ.25 లక్షలు కట్టిన వారికి 36 నెలల పాటు నెలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారు. ఐడీ స్కీమ్ అని మరొకటి ఉంది. దీంట్లో రూ.9,999 కడితే 36 నెలల పాటు రూ.888 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇలాంటి పేమెంట్లే కాదు… కార్లు, ఫ్లాట్లు, విహారయాత్రలు, బైకులు, ల్యాప్ టాప్ లు, నగలు కూడా కానుకలుగా ఇస్తామని ప్రజలను నమ్మించారు. వీరి ప్రకటనలు ఆకర్షణీయంగా ఉండడంతో జనాలు భారీగా డబ్బులు కట్టి స్కీమ్ లలో చేరారు. క్యూ మార్ట్ మోసాల కేసు దర్యాప్తు చేస్తుంటే, ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం బయటపడింది. ఈ కేసులో ఇప్పటివరకు బాబీ చౌదరి, రియాజుద్దీన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశాం. పూజా కుమారి, షకీలా అనే మహిళలు పరారీలో ఉన్నారు” అని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news