వాక్ ఛీ..యూరిన్ ను ఎలా తాగుతున్నారో చూడండి..!

-

మందుబాబులు ముఖ్యంగా ఎంచుకునేది బీరును మాత్రమే.. ఆ తర్వాత ఎవరి స్థొమతను బట్టి వాళ్ళు తాగుతారు.ముందు బీరు రుచిని చూసిన వాడే నెక్స్ట్ ఏదైనా చేస్తారు.. అందుకే అంటారు బీరు రుచిల యందు ఆ బీరు వేరేయా అని..ఇప్పుడు ఓ బీరు తెగ చక్కర్లు కోడుతుంది.. ఆ బీరు పేరు యూరిన్ బీరు..కానీ పేరు మార్చి గ్రీన్ బీరు పేరుతో తెగ అమ్మెస్తున్నారు..యూరిన్ తో బీరు ఎలా చేస్తారు..వాక్ ఛీ అంటున్నారా..కాస్త ఆగండి..ఆ బీరు గురించి పూర్తిగా తెలుసుకుందాం..

అసలు విషయాన్నికొస్తే.. సింగపూర్ లోని ఓ కంపెనీ తయారు చేసే ‘యూరిన్ బీర్’ దేంతో తయారు చేస్తారో తెలిస్తే ‘యాక్’అంటారు. పేరు వింటేనే తెలిసిపోతోంది కదూ దేంతో తయారు చేస్తారో తెలియదు కానీ దీని కోసం మాత్రం జనాలు ఎగబడుతున్నారు.ఇక ఆలస్యం ఎందుకు ఈ కంపెనీ తయారు చేస్తున్న బీరుకు అంత టేస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింగపూర్ లోని ‘న్యూబ్రూ కంపెనీ ఈ బీరును తయారు చేస్తుంది.దాదాపు 20 సంవత్సరాల నాటి మురుగునీటిని శుద్ధిచేసి మరీ తయారుచేస్తున్న ‘యూరిన్ బీర్’ను గ్రీన్ బీర్‌గా ప్రచారం చేస్తోంది..సింగప్‌పూర్‌లోని న్యూబ్రూ కంపెనీ. సింగపూర్ న్యూబ్రూ ఉత్పత్తి చేస్తున్న యూరిన్ బీర్‌కు భారీ ఆదరణ లభిస్తుండటం అంతకంటే విశేషం అని చెప్పాల్సిందే..ఎన్నో పరీక్షలు వివిధ దశల్లో వడపోత తర్వాత ఆరోగ్యకరమైన బీర్‌ను తయారు చేస్తున్నామని..ఈ బీర్ త్రాగడానికి సురక్షితమని సదరు కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా తమ స్పెషల్‌ బీరు ఆరోగ్యానికి ఆరోగ్యం, అద్భుతమైన రుచి కూడా అని కూడా చెప్పుకొస్తోంది..

మరో విషయం ఏంటంటే..నీటి కొరతపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టిన ప్రభుత్వ నీటి సంస్థ దీన్ని అధిగమించేందుకు వినూత్న పరిష్కారాల్ని అన్వేషిస్తోంది. బీర్‌లో 90 శాతం నీరు ఉంటుందనీ అందుకే అల్ట్రా-క్లీన్ హై-గ్రేడ్ రీసైకిల్ వాటర్‌తో తయారుచేస్తున్నామని కంపెనీ తెలిపింది. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్‌, వాటర్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ ‘Brewerkz’ న్యూబ్రూ ఏప్రిల్ 8న ప్రారంభించింది. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే న్యూబ్రూ సింగపూర్ ‘గ్రీనెస్ట్ బీర్’ ఆవిష్కరణ అని సదరు కంపెనీ ఏండీ చెప్పుకొచ్చారు..ఏది ఏమైనా కూడా ఇది చర్చనీయాంశంగా మారడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news