మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. BEL నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. 80 డిప్లొమో అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని ఘజియాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్ లో వర్క్ చెయ్యాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,400 వరకు స్టైఫండ్ ఇస్తారు. నవంబర్ 2018 తర్వాత ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఖాళీల వివరాల లోకి వెళితే.. మెకానికల్ ఇంజనీరింగ్ 20, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 20, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ 20, మోడ్రన్ ఆఫస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరీయల్ ప్రాక్టీస్ 20.
దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25న ప్రారంభం అయ్యింది. నవంబర్ 15 అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. అభ్యర్థులు డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు www.mhrdnats.gov.in వెబ్ సైట్లో అప్లికేషన్లను పంపాలి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.