మనం సాధారణంగా తెల్ల బియ్యం తో అన్నం వండుకుని తింటాము. అయితే నల్ల బియ్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మరి నల్ల బియ్యం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..?, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండొచ్చు..? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఒక లుక్కేయండి.
బరువు తగ్గొచ్చు:
నల్ల బియ్యంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనితో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేట్లు చూసుకుంటుంది ఇలా బరువు తగ్గడానికి నల్ల బియ్యం సహాయం చేస్తుంది.
కంటి ఆరోగ్యానికి మంచిది:
నల్ల బియ్యం తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. నిపుణులు చేసిన రీసర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే రెటినాల్ డామేజ్ అవకుండా ఇది చూసుకుంటుంది అని తేలింది.
జీర్ణ సమస్యలు ఉండవు:
దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో కాన్స్టిట్యూషన్ వంటి సమస్యలు ఉండవు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు కూడా రాకుండా ఇది చూసుకుంటుంది. ఇలా జీర్ణ సమస్యలను పోగొడుతుంది నల్లబియ్యం .
ఆస్తమా తగ్గుతుంది:
ఆస్తమా ఉన్నవాళ్లు నల్ల బియ్యం తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల బియ్యం తీసుకోవడం వల్ల క్రమంగా ఆస్తమా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
డయాబెటిస్ తగ్గుతుంది:
ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల అరగడానికి ఎక్కువ సేపు సమయం పడుతుంది అలాగే షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇన్సులిన్ లెవల్స్ పెరగకుండా నల్ల బియ్యం ఉపయోగపడుతుంది. ఇలా నల్ల బియ్యం తో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.