ఏలకులు:
జలుబును తగ్గిస్తుంది
ఏలకులలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో ఉంటే మరోటి నలుపు రంగులో ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రెండు మూడు ఏలకులని తీసుకుని కొద్ది పాటి తేనె కలుపుకుని టీ తయారు చేసుకుంటే, జలుబు చాలా తొందరగా నయం అవుతుంది.
రక్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది
ఏలకులు రక్తంలో ప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల నరాల్లో రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటుంది.
చక్కెరని శాతాన్ని నియంత్రిస్తుంది
నల్లటి ఏలకుల్లో మాంగనీస్ ఉంటుంది. దానివల్ల మన శరీరంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది.
తాజా శ్వాస అందిస్తుంది
ఇందులో ఉండే సినోల్ అనే పదార్థం నోటి దుర్వాసనని పోగొడుతుంది. తద్వారా నోరు ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.
జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది
దీని తినడం ద్వారా వెలువడే ఎంజైములు జీర్ణశక్తిని పెంచడంలో సాయపడతాయి.
లవంగాల వచ్చే లాభాలు
క్యాన్సర్ నుండి కాపాడుతుంది.
క్యాన్సర్ కణితి ఏర్పడకుండా లవంగాణలు రక్షణనిస్తాయి. మన శరీరంలో క్యాన్సర్ కణాలను బయటకి పారదోలి కాపాడుతుంది.
చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది
ఇందులో ఉండే పోషకాలు చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి. శరీరంలో చక్కెర శాతాన్ని పెంచకుండా ఉంచుతాయి.
తలనొప్పిని నివారిస్తుంది
తలనొప్పి తీవ్రంగా ఉన్నట్లయితే మీ కర్చీఫ్ లో లవంగాలని కొరికి ఉంచుకుని, దాన్నుండి వచ్చే వాసనని చూస్తూ ఉంటే తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది
అధిక ఒత్తిడి నుండి విముక్తి కలిగించి ప్రశాంతతని చేకూర్చడంలో లవంగాలు బాగా పనిచేస్తాయి.