దుంప అంటే.. చాలా మందికి బంగాళదుంపనే వెంటనే మైండ్ లోకి వస్తుంది. కానీ ఇంకా చాలా దుంపలు ఉన్నాయి. కంద, చామ, చిలకడ దుంప ఇలా.. కానీ ఎప్పుడు మార్కెట్ కు వెళ్లినా.. బంగాళదుంపనే ఎందుకు కొంటారు..? చామదుంపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. కానీ చాలా తక్కువ మంది వీటిని తింటారు. మీకు తెలుసా.. కొలెస్ట్రాల్ తగ్గించి, చెక్కర స్తాయిలను కంట్రోల్ చేయడంలో చామదుంపలు బాగా పనికొస్తాయి. అసలు షుగర్ పేషెంట్స్ దుంపలకు దూరంగా ఉండాలని చెబుతారు.. అవును బంగాళదుంప తినకూడదు కానీ.. చామదుంప, చిలకడదుంప, కందలాంటివి తినొచ్చు.
అధిక శరీర బరువును తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. చామగడ్డల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండడమే కాకుండా సోడియం శాతం తక్కువగా ఉంటుంది.. ఈ ఆహారం నిదానంగా జీర్ణంమై నెమ్మదిగా శరీరానికి శక్తినిస్తుంది. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది.
చామదుంపల వల్ల ఉపయోగాలు..
అనేక చర్మవ్యాధులను నివారిస్తుంది.
ఎముకల పటిష్టతకు దోహదం చేస్తుంది.
దృష్టి లోపాలను దూరం చేస్తుంది.
వీటిని తినటం వల్ల రోగనిరోధకశక్తికి పెరుగుతుంది.
హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది.
దుంపలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపకరిస్తాయి.
గుండె జబ్బులు రాకుండా చేయటంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది.
శరీరంలో ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేసి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి. డయాబెటిక్ రోగులకు చామదుంప సరైన ఆహారంగా చెప్పవచ్చు.
చామగడ్డలో విటమిన్- ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు పీచు ఎక్కువగా ఉంటుంది.
అధిక పీచు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యేన్సర్‌ల నుంచి కాపాడడమే కాకుండా క్యేన్సర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఆహారం. పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
చామగడ్డ వేరులలో డయోస్జెనిన్ పుష్కలంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పికి చికిత్సగా ఇది ఉపయోగపడుతుంది.
చామగడ్డ మూలాలలోని డయోస్జెనిన్ కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.
-Triveni Buskarowthu