ఈ ఆకులతో సులువుగా సమస్యలకి చెక్ పెట్టేయచ్చు తెలుసా..?

-

కొన్ని చెట్ల ద్వారా మొక్కల ద్వారా అనారోగ్య సమస్యలు పోతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. వీటి వలన సులువుగా అనారోగ్య సమస్యలుని పోగొట్టుకోవచ్చు. అయితే ఈ రోజు మనకు దగ్గరలో ఉండే కొన్ని మొక్కల గురించి చూద్దాం. వీటి వల్ల అనారోగ్య సమస్యలు సులువుగా పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా కడుపులో వచ్చే సమస్యలు వీటి ద్వారా ఎలా పోగొట్టుకోవచ్చు అనేది తెలుసుకుందాం..!

నిరుగుండి ఆకులు:

దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా మందికి వీటి గురించి తెలియదు. ఈ ఆకుల్ని పొడిచేసి దానిని గోరువెచ్చని నీటితో తీసుకుంటే కడుపుకు సంబంధించిన సమస్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్ కాన్స్టిపేషన్ మొదలైనవి తొలగిపోతాయి.

శరీరం మీద ఏమైనా వాపు వంటివి ఉంటే ఈ పొడిని వాటిమీద పెట్టడం వలన అవి తొలగిపోతాయి. రుతుక్రమం లో వచ్చే సమస్యలు కూడా సులువుగా తొలగిపోతాయి. ఈ ఆకుల్ని ముద్ద చేసి దానిని పింపుల్స్ మీద పెడితే మొటిమలు సులువుగా పోతాయి. జుట్టు కి దీనిని వాడితే జుట్టు రాలిపోయే సమస్య తొలగిపోతుంది మరియు జుట్టు షైనింగ్ గా అవుతుంది.

ప్లమ్ ఆకులు:

వీటి వల్ల కూడా చాలా సమస్యలు సులువుగా పోతాయి. ఈ ఆకుల్ని కల్లుప్పు తో పాటు కలిపి నీళ్ళు పోసి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

అలానే గొంతు నొప్పి కూడా పూర్తిగా తగ్గుతుంది. కడుపులో మంట వంటివి ఉంటే ఈ ఆకులతో మనం ఆ సమస్యని పోగొట్టుకోవచ్చు. డయేరియా వంటి సమస్యలు కూడా దీంతో సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ఆకులని పాలలో కలిపి తీసుకుంటే డయేరియా తగ్గిపోతుంది.

అరటి ఆకులు:

అరటి వేర్లతో ఒబేసిటీని తగ్గించొచ్చు. అదే విధంగా అరటి వేర్లను తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యలు పోతాయి. కాన్స్టిపేషన్ ని కూడా దీనితో సాల్వ్ చేసుకోవచ్చు.

కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఈ వేర్లతో పోతాయి. అరటి వేర్లని ఏదైనా గాయాల మీద గ్రైండ్ చేసి పెడితే త్వరగా గాయాలు మానిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news