కంటి ఆరోగ్యాన్ని వీటిని డైట్ లో తీసుకోండి…!

-

ఈ మధ్యకాలంలో కంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. పిల్లలకి కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. అందుకనే కంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. మనం తీసుకునే ఆహారం జీవనశైలి ద్వారా కంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

కంప్యూటర్ స్క్రీన్స్, ఫోన్లు, టీవీ వంటివి ఎక్కువ చూడటం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. అందుకని ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

పాలకూర:

పాలకూర కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్ మంచి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. నట్స్ లో విటమిన్ ఎ మరియు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. కంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతాయి.

కమలాలు:

కమలాలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఐ సైట్ ని ప్రమోట్ చేస్తోంది. విటమిన్ ఏ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. రెటినాల్ కి ఇది చాలా మంచిది.

పొద్దుతిరుగుడు విత్తనాలు:

ఎక్కువ మంది సన్ఫ్లవర్ గింజలను కూడా ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నారు. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇందులో ప్రోటీన్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అలానే కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

చిలకడ దుంపలు:

ఇది కూడా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. ఇంఫ్లమేషన్ ను కూడా తొలగిస్తుంది. కంటికి కూడా ఎంతో మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news