డయాబెటిస్‌ ఉన్నావారు రాత్రులు కచ్ఛితంగా నిద్రపోవాలి. లేదంటే.. ఇబ్బందిపడాల్సి ఉంటుంది!

-

శరీరంలో మార్పులతో పాటు వాతావరణ మార్పులతో మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డయాబెటిస్‌ వచ్చి ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు మూత్రవిసర్జన అయింది అన్న అనుమానంతోనే సగం షుగర్‌ వ్యాధి వస్తుంది. ఇకపోతే మనమంతా బతికేది ఈ బిజీలైఫ్‌లోనే కదా. జెనరల్‌ షిప్ట్‌, నైట్‌ షిప్ట్‌లంటూ ఉద్యోగానికి వెళ్తుంటాం. జెనరల్‌ షిప్ట్‌ అన్ని విధాలా మంచిదే కానీ, నైట్‌షిప్ట్‌ వల్ల పగలంతా సమయం కలిసి వస్తుందని రాత్రులు ఉద్యోగానికి వెళ్లడానికి ఒప్పుకుంటారు.

దీంతో అనర్థాలు కొని తెచ్చుకుంటారు. అసలు రాత్రలు పనిచేయడం వల్ల నిద్ర సరిగాపోరు. పైగా పగలు నిద్రపోయేందుకు సమయం కేటాయిస్తారు. దీంతో జీర్ణసమస్యలు, ఆహార సమయం అన్నీ మారిపోతాయి. ఆరోగ్యం సగం దెబ్బతింటుంది. పైగా నిద్రలేకపోవడం వల్ల అలసట, వికారం, వాంతులు మొదలవుతాయి. యాక్టివ్‌గా ఉండలేరు. అందరిపై చిరాకు పడుతుంటారు. ఇలా ఉంటే కొంతమేరకు పర్వాలేదు. దీనివల్ల మరిన్ని రోగాలు కూడా వస్తాయంట. అవేంటంటే..

– డయాబెటిస్‌ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాద ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్‌ చెక్‌ పెట్టాలంటే.. బాగా నిద్రపోవాలి.

– డయాబెటిస్‌ నుంచి బయట పడాలంటే కాకరకాయ, బీరకాయ, జొన్న రొట్టెలు తినాల అంటుంటారు. ఇప్పుడు అన్నీ కరెక్టుగా ఉండేలా తీసుకుంటున్నారు. అప్పట్లో ఇవేం లేవు. కడుపునిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, శరీరం అలిసేలా పనిచేయడం ఇవే తెలుసు. అందువల్లే అప్పట్లో వారికి ఎలాంటి రోగాలు దరిచేరేవి కావు. ఆహారపదార్థాల కంటే ముందుగా కష్టపడి పనిచేసి సమయానికి చక్కగా నిద్రపోవాలి. అప్పుడే డయాబెటిస్‌ తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

– ఇటీవలె పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. నిద్రలేమి కారణంగానే డయాబెటిస్‌ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. 6 గంటలు కన్నా తక్కువ నిద్రపోయే వారికే ఎక్కువ మంది డయాబెటిస్‌ వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

– ఆ విధంగా నిద్రపోకపోవడం వల్లే డయాబెటిస్‌ వస్తుంది. అయినా అలానే కొనసాగిస్తూ ఉంటే షుగర్‌ వ్యాధి ఎక్కువ అవుతుంది. అందుకే.. రాత్రి సమయంలో ఖచ్చితగా నిద్రపోవాలి. అది కూడా 8,9 గంటలు నిద్రపోవాలి. ఏ సమయంలో చేయల్సిన పనులు అప్పుడే చేయాలి. కరెక్ట్‌ నిద్ర పాటిస్తే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. అని చెబుతున్నారు డాక్టర్లు. డయాబెటిస్‌ ఉన్నవారు సమయానికి నిద్రపోయి వ్యాధిని కంట్రోల్‌లో ఉంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news