ఏపీ సీఎం, వైసీపీ అదినేత జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన పాలన సాగిస్తున్నా రు. తను తీసుకున్న నిర్ణయం విషయంలో ఆయన ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. కేంద్రం నుంచి కానీ, న్యాయ స్థానాలనుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. తాను చేపట్టిన నిర్ణయాలను ఆయన సునాయాసం గా ముందుకు తీసుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి దూకుడు ప్రదర్శించడం పట్ల ఏపీ ప్రజలు ఏమనుకుం టున్నారు. 50.6 శాతం ఓట్లతో విజయం సాధించి 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తనకు ఈ మాత్రం దూకుడు లేకపోతే.. ఎలా అనే జగన్ ఆలోచనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నా రు? అనే చర్చ తెరమీదికి వచ్చింది.
ఐఆర్ ఎస్ అదికారి జాస్తి కృష్ణ ప్రసాద్ విషయంలోను, ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు విషయంలో ను, రివర్స్ టెండర్ల అంశంలోనూ, మండలి రద్దు, పాలన వికేంద్రీకరణ, ఏపీసీఆర్ డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం విషయంలోనూ జగన్ ఎక్కడా ఎవరి మాటా వినడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాను తీసుకున్న నిర్ణయాల మేరకే ఆయన ముందుకు సాగుతున్నారనేది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న వాస్తవం. మరీ ముఖ్యంగా విశాఖ సహా ఇతర ప్రాంతాలకు కార్యాలయాలను తరలిం చడంలోను జగన్ మరింత వేగంగా పనిచేస్తున్నారు.
మరి గతంలో పాలించిన చంద్రబాబు ఇలానే ముందుకు వెళ్లారా ? అంటే.. లేదనే చెప్పాలి. కేంద్రం అడ్డు తగిలినా.. కోర్టులు అడ్డు చెప్పినా.. వెంటనే ఆయా విషయాలను చంద్రబాబు పక్కన పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు, ఆయా సంస్థలపై ఎదురుదాడి చేశారే తప్ప కార్యక్రమాలను మాత్రం వాయిదా వేసుకున్నారు. మరి ఇప్పుడు జగన్ అలా ఎదురు దాడి చేయడంమానుకుని తాను చేయాలనుకున్న పనిని పూర్తి చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
మరి ప్రజలు దీనిని ఎలా తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. నిజానికి ప్రజలు కూడా కొన్ని విషయాల్లో కోర్టులు తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజామోదం లేనప్పుడు ఎవరిమాటా వినాల్సిన అవసరం లేదనే విధంగా ఇటీవల కాలంలో ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు సో.. ఇప్పుడు జగన్ విషయంలోనూ మెజారిటీ ప్రజలు ఆయన దూకుడును స్వాగతిస్తున్నారు. మండలి రద్దు సహా.. కార్యాలయాల వికేంద్రీకరణ వంటివి జరుగుతున్నా.. ప్రజలు స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గట్స్ ఉన్న నాయకుడిగా జగన్‌ను ప్రజలు చర్చించుకుంటున్నారు. సో.. ఈ దూకుడు మంచిదేనని వారు పరోక్షంగా చెబుతున్నారన్నమాట..!