వర్షం పడక ముందే కట్టడి కావాలి… ఆ తర్వాత మన చేతుల్లో ఉండదా…?

-

కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే ఇంకా సరిగా రెండు నెలలు. ఈ రెండు నెలల్లో కరోనా కట్టడి కావాలి. లేకపోతే ఆ తర్వాత కరోనా కట్టడి కావడం అనేది మన చేతుల్లో ఉండదు అనేది నిపుణులు చెప్పే మాట. అలా ఎందుకు…? ఈ స్టోరీలో చూద్దాం. వర్షం పడితే మన దేశంలో ముందు సాధారణ జ్వరాలు అనేవి బయటపడతాయి. మలేరియా, డెంగ్యు ఇలాంటివి క్రమంగా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆ లక్షణాలు కూడా కరోనాకు చాలా దగ్గరగా ఉంటాయి. దీనితో జనాలు భయం తో ఆస్పత్రులకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పరిక్షలు చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. మే నెల వచ్చేస్తుంది. మే చివరి వారం నుంచే గాలి దుమ్ములు వర్షాలు మొదలు అవుతూ ఉంటాయి. జూన్ మొదటి రెండో వారం నుంచి వర్షాలు పూర్తి స్థాయిలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. దీనితో జనాలకు కేసులు బయటకు పడే అవకాశం ఉంటుంది.

వాతావరణం ఇంకా చల్లబడిపోయే అవకాశం ఉంటుంది. చలి కూడా మొదలవుతుంది. అప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు. కంట్రోల్ అయితే ఈ రెండు నెలల్లో కంట్రోల్ అవ్వాలి. ఆ తర్వాత ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఉంటుంది. ఇది భయ పెట్టడానికో లేక మరో దానికో కాదు. అప్పుడు మన చేతుల్లో చేయడానికి ఏమీ ఉండదు. వ్యాక్సిన్ కోసం ఎదురు చూడటం మినహా… లాక్ డౌన్ వలన కూడా ప్రయోజనాలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news