భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

-

తగ్గు ముఖం పట్టిన గోదావరి 43.7 అడుగుల వరకు చేరినప్పటికీ భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు తగ్గుతూ వస్తుంది. రెండు వారాల ఎక్కువ నుంచి వచ్చిన భారీ వరదల వల్ల భద్రాచలం వద్ద 71.3 అడుగులకు చేరుకుంది అది ఇప్పుడు తగ్గుతూ వచ్చి 43.7 అడుగుల వద్ద ఉన్నది. ఈనెల 11 నుంచి గోదావరి వరద తీవ్ర రూపం దాల్చినప్పటికీ గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది.

ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి .53 అడుగులకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక ,48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక, 43వ అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద జారీ చేయటం అనేది నిబంధనలు వున్నాయి. అయితే ఇప్పుడు 40.7 అడుగుల వద్ద ఉన్నప్పటికీ ఇంకా మూడవ ప్రమాద హెచ్చరికనే కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద 71.3 అడుగుల వరకు వచ్చి ఆ తర్వాత గోదావరి తగ్గుముఖం పట్టింది అయితే ఇది చాలా స్వల్పంగా తగ్గుతూ వచ్చింది.

ఎగువ నుంచి ఇప్పటికి వరద వస్తూనే ఉందనీ ఇందువల్లనే ప్రమాద స్థాయి మించి వరద వస్తుందని ఆందోళనతో జిల్లా అధికార యంత్రాంగం గోదావరి వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను తొలగించడం లేదనీ చెబుతున్నారు. ఇప్పటికి గోదావరి వేగంగా ఉండటంతో రామాలయం సమీపంలోని స్నానాలు ఘట్ట వద్ద భక్తులకి అనుమతి ఇవ్వటం లేదు. రామాలయం చుట్టుపక్కల పూర్తిగా క్లీన్ కాగా నీటిని అంతా గోదావరిలోకి పంపింగ్ చేశారు. రామాలయం సమీపంలో స్నానాల గ ట్టు వద్ద పారిశుధ్య సిబ్బంది క్లీనింగ్ చేశారు 43.7 అడుగుల దగ్గర ఉన్నప్పటికీ ఇంకా మూడవ ప్రమాద హెచ్చరికని అధికారులు కొనసాగిస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news