మనం రోజూ చూసేవే కానీ కనీసం వాటి పేర్లు కూడా మనకు తెలియదు..తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకోండి..కానీ పేర్ల సంగతి పక్కన పెడితే వాటి ఉపయోగాలు మాత్రం మనం కచ్చితంగా తెలుసుకోవాలి. సమస్యలకు సమాధానం సహజంగా దొరుకుతుంటే.. ఎందుకు ఇంగ్లీష్ మందులవైపు పరుగెత్తడం. ఎలాంటి మందులు లేనిరోజుల్లోనే మన పూర్వీకులు తొంభైలు దాటలేదా..? నిజంగా ఇంగ్లీష్ మందులకు అంత పవర్ ఉంటే..యావ్రేజ్ ఆయుష్షు 76కి పడిపోయిందని లెక్కలు ఎందుకు చెబుతున్నాయి..? కిడ్నీలో రాళ్లు తగ్గించుకోవటం కోసం కొండపిండి మొక్క అద్భుతంగా పనిచేస్తుందట. ఈ మొక్క ఏంటో, దీని కథేంటో చూద్దామా..!
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు కొండపిండి వేర్లు, గోక్షూర వేర్లు, ఒలిమిడి వేర్లు, ఉత్తరేణి వేర్లను సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి కుంకుడు గింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను మంచినీటితో కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్య నయం అవుతుంది. ఓడియమ్మ.. ఈ వేర్లని ఇప్పుడు ఏడ పట్టుకురావాల్రా అనుకుంటారేమో..ఆయుర్వేద షాపుల్లో ఇవి మీకు పేర్లు చెబితే ఇస్తారు.
తలనొప్పితో బాధపడే వారు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి నుదుటికి పట్టీలా వేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
అంగశూల సమస్యతో బాధపడే వారు కొండపిండి మొక్క రసంలో జీలకర్ర చూర్ణాన్ని కలిపి వాడడం వల్ల అంగశూల సమస్య తగ్గుతుంది.
ఈ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఆకులు దొరకని వారు ఆయుర్వేదం షాప్‌లో దొరికే కొండపిండి ఆకు పౌడర్ తెచ్చుకుని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ వేసి మరిగించి వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా 20 రోజుల పాటు తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి.
కొండపిండి ఆకును పప్పుగా తయారు చేసుకొని కూడా తినవచ్చు. ఈ ఆకు తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కాస్త ఓపిక ఉంటే..ఇలా నాచురల్గా సమస్యలను తగ్గించుకోవచ్చు.