భక్తి టీవీ కోటిదీపోత్సవం నాల్గవ రోజుకి చేరుకుంది. కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. వేలాదిమందిని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తోంది. నాల్గవ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు.
అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనామృతం వుంటుంది. వేదికపై పూజలో భాగంగా రాహుకేతు పూజ, భక్తులచే నాగపడగలకు రాహుకేతుపూజల జరుగుతుంది. ఇవాళ్టి కోటి దీపోత్సవంలో శ్రీకాళహస్తీశ్వర కల్యాణం వుంటుంది. అనంతరం గజవాహనం, సింహవాహనం వుంటుంది. అందరూ ఆహ్వానితులే. వేదిక ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్.