కోవాగ్జిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్.. ధరెంతో తెలుసా..?!

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకీ 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ పూర్తిగా నిండిపోయాయి. వైద్యులు కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప.. ఆస్పత్రికి రావొద్దని సలహా ఇస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇండియాలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, రిమిడెసివిర్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ తీవ్రతరం కావడం వ్యాక్సిన్ విడుదల చేయడానికి ఆయా టీకా తయారీ సంస్థలు వాటికి ధరలను నిర్ణయించాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తర్వాత.. టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ కూడా టీకా ధరను నిర్ణయించింది.

కోవాగ్జిన్
కోవాగ్జిన్

రూ.600కు కోవాగ్జిన్..
భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను రూ.600కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో తెస్తోంది. ప్రభుత్వానికి తక్కువ ధరలో విక్రయిస్తున్నట్లు తెలిపినా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం ఈ వ్యాక్సిన్ ధర రూ.1200 ఉంటుందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.అల్లా తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తమ కంపెనీ టీకాను మోతాదుకు రూ.150 చొప్పున కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తోందని, కేంద్రం దాని తరఫున వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తోందని వారు తెలిపారు. దీని ఎగుమతి ధర $ 15-20 లేదా రూ.1,123 నుంచి 1,498 మధ్య ఉంటుందన్నారు. సంస్థ యొక్క ఉత్పత్తి సామర్థ్యంలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వానికి టీకా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కోవిడ్‌తోపాటు చికెన్ గున్యా, జికా, కలరా ఇతర ఇన్‌ఫెక్షన్లకు వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర..
అయితే ఇంతకు ముందు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ ధరను నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మోతాదుకు రూ.400, ప్రైవేట్ ఆస్పత్రులకు మోతాదుకు రూ.600 ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కేంద్రంతో చేసుకున్న టీకా ఒప్పందం ముగియడంతో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధరను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మోతాదుకు రూ.400 ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే వ్యాక్సిన్ సామర్థ్యం పెరగాలంటే.. పెట్టుబడులు అవసరం. అందుకే వ్యాక్సిన్ ధరను కేటాయించినట్లు ఆయా టీకా తయారీ సంస్థలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news