తాగునీటిలో కూడా కరోనా వైరస్ రెండు రోజుల పాటు బతికి ఉండే అవకాశం ఉందని సీసీఎంబీ వెల్లడించింది. 4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చల్లని నీటిలో వైరస్ కు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంటుందని ఇది వేడినీళ్లలో 65 డిగ్రీల వద్ద వైరస్ నిమిషాల వ్యవధిలోనే చనిపోతుందని పేర్కొంది.
ఐదు తాగునీటి వళ్ల వైరస్ బారిన పడిన కేసులు మన దేశంలో ఎక్కడా నమోదు కాలేదని ముందు జాగ్రత్తగా వెచ్చని నీటిని, వేడి పదార్థాలను తీసుకోవడం మంచిదని సీసీఎంబీ సూచించింది. కరోనా వైరస్ ఎప్పటికి అంతమవుతుందనేది చెప్పలేమని, అందరూ టీకాలు వేయించుకోవడం, జాగ్రత్తలు పాటించడం ద్వారా రెండు నెలల్లో మహమ్మారి ప్రభావాన్ని తగ్గించగలుగుతాం. రాబోయే రోజుల్లో మరిన్ని ఔషధాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.