బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో ముంచుదాం : భట్టి

-

కొల్లాపూర్ సభ రేపు రాష్ట్ర గతిని మార్చేటువంటి సభ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి కొల్లాపూర్ సభ సంకేతం ఇస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. అందుకే అనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతున్నా… కృష్ణానదిలో చుక్కనీరు కూడా పారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా భేరి బహిరంగ సభలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో ముంచుదామని చెప్పడానికే తామంతా కొల్లాపూర్ కు వచ్చామని చెప్పారు.

Bhatti Vikramarka : ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది  - NTV Telugu

దర్యాప్తు సంస్థలు, పోలీసులను మీ దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్ కాల్ ఇస్తామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది అని భట్టి విక్రమార్క అన్నారు. బంద్ కాల్ పిలుపు ఎవరిపైన ఇస్తున్నారు? బంద్ దేని కోసం? మీ పాలనపైన మీరే ఇచ్చుకుంటారా? బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. దాడిపై సమగ్ర విచారణ చేసి నిజా నిజాలను బయట పెట్టండి అని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడులను ప్రోత్సహించదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే అహింస పార్టీ ఇటువంటి దాడులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది అని ఆయన తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news