బ్రేకింగ్ : కేటీఆర్ పై భూపేందర్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Join Our COmmunity

తెలంగాణా మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భూపేందర్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి- రాచరికానికి జరుగుతున్న ఎన్నికలని భూపేందర్ యాదవ్ అన్నారు. అబద్దాలు చెప్పడంలో మంత్రి కేటీఆర్ ను మించిన వాళ్ళు లేరని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మెట్రో రైల్, కోవిడ్ నిధులు ఎవరిచ్చారో కేటీఆర్ తెలుసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ కేసీఅర్ , కేటీఆర్ కుటుంబానిది మాత్రమే కాదని ఆయన అన్నారు.

హైదరాబాద్ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక నగరం అని ఆయన అన్నారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవబోతోందన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్న ఆయన నగర ప్రజలకు మంచి నీరు సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన అన్నారు. హైద్రాబాద్ నగరం భారత ప్రజల హృదయంలో ఉంటోందన్న ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ  జాతీయ నాయకులొస్తే.. తప్పేంటని ప్రశ్నించారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news