నగరవాసులకు బిగ్ అలర్ట్… కాసేపట్లో భారీ వర్షం

-

కాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని GHMC హెచ్చరించింది. అత్యవసరం అయితే 040-21111111 5 90001136675 కు కాల్ చేయాలని సూచించింది.ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ పాటు నగరంలోని మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

మరోవైపు…నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అవి నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version