ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిన బిగ్ బీ.. ఎన్ని కోట్లంటే..?

-

ఇండియన్ సినీ పరిశ్రమలో బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందినవారు. ఇకపోతే ఒకవైపు సినిమాలలో మరొకవైపు కౌన్ బనేగా కరోడ్ పతి -14 సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనను తాను మరింత ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ముంబైలో ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబై నగరంలోని ఫోర్ బంగ్లా ప్రాంతంలో పార్ధీనన్ సొసైటీలో ఈ స్థిరాస్తిని కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది.

బహుళ అంతస్తుల భవనంలో 31 వ ఫ్లోర్లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ప్లాటును ఆయన కొన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు కూడా బిగ్ బి తమ ఫ్లాట్లో ఉండబోతున్నారు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫ్లాట్ ఖరీదు ఎంత అనే విషయం బయటకు రానప్పటికీ ఖరీదైన ప్రాంతంలో ఫ్లాటును కొనుగోలు చేయడంతో దాని విలువ సుమారుగా రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వెలబడుతున్నాయి. ఈ ఫ్లాట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ నివాసం ఉండడానికి కాదట.. కేవలం పెట్టుబడి ప్రయోజనాల కోసమే కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈయన నటించిన బ్రహ్మస్త్ర సినిమాలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇకపోతే ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా ఈయన నటిస్తున్నారు. ఇక మరొకవైపు వికాస్ వాహ్ల్ తెరకెక్కిస్తున్న గుడ్ బై సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కి కూతురుగా రష్మిక మందన్న నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news