LIGER :”లైగర్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ !

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టార్గెట్ మిస్ ఫైర్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా.

అయితే ఈ సినిమా నుంచి ఆజాగా ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోపే… ఓటిటి రిలీజ్ డేట్ కూడా వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 22 అంటే రేపు ఈ సినిమా ఓటీటీ లోకి రానున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. రేపు హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం అందుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news