తెలుగు బిగ్ బాస్ షో: గీతు లాగానే, ఆదిరెడ్డి కూడా ఎలిమినేట్.!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. అసలే అంతగా ఫేమ్ లేని వారు రావటం వల్ల మంచి రేటింగ్ రావడం లేదు. అలాగే ఆడే వారు కూడా దెబ్బలు తగలకుండా , ఎవరికి ఇబ్బంది లేకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు. మిగిలిన వాళ్ళు ఏదోలా నెట్టుకొస్తున్నారు.

ఇక బిగ్ బాస్ షో ఆది రెడ్డి హంగామా చెప్పాల్సిన పనిలేదు. హౌస్ లో ఉన్న వారి అందరిని కట్టడి చేస్తున్నాడు. లేని పోని లాజిక్లు చెప్పి ఆడుతున్న వారిని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కామన్ మాన్ వచ్చిన ఆది రెడ్డి, అక్కడ మాత్రం సెలబ్రిటీ కంటే ఎక్కువ హడావుడి చేస్తున్నాడు.ఇక చాలా మంది ఆది రెడ్డి ఓవర్ యాక్షన్ చూడలేక బ్రహ్మానందం గారి టైప్ లో నాగార్జున గారు ఆదిరెడ్డి ని ఎలిమినేట్ చేసేయండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక నాగార్జున గారు కూడా ఆది రెడ్డి కి ఒక రేంజ్ లో క్లాస్ పీకారు. అందరిని కంట్రోల్ చేసే పనులు మానుకోవాలని , నువ్వు చేసే దానిలో కూడా తప్పులు కూడా ఉన్నాయని, తప్పులు ఎత్తి చూపారు. ఓవర్ యాక్షన్ మరియు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల గలాటా గీతు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇక నువ్వు కూడా నిన్ను నువ్వు మార్చుకోక పోతే నువ్వుకూడా ఎలిమినేషన్ కావడం ఖాయం అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news