ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ప్రతీ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. దీపాలు వెలిగించి ఐక్యత చాటారు ప్రజలు అందరూ. గో కరోనా అంటూ నినాదాలు ఇస్తూ ప్రజలు అందరూ దీపాలు వెలిగించారు. దేశం మొత్తం దీపాలతో వెలిగిపోతుంది. ప్రతీ ఇంట్లో కులాలకు మతాలకు అతీతంగా దీపాలు వెలిగించారు ప్రజలు. ప్రజలు అందరూ కూడా బయటకు వచ్చి తమ దీపాలను ప్రదర్శించారు. చిన్నా పెద్దా అందరూ కూడా శక్తిని చాటారు.
మతాలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ఈ దీపాలను వెలిగించారు ప్రజలు. ప్రతీ ఇల్లు కూడా దీపాలతో చాలా అందంగా కనపడుతుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారతం దేదీప్యమానంగా వెలిగిపోయింది.. ప్రముఖ దేవాలయాల్లో కూడా అఖండదీపాలను వెలిగించారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తమ తమ ఇళ్ళల్లో దీపాలు వెలిగించారు.ప్రధానమంత్రి మోదీ, మంత్రులు రాజ్‌నాథ్, గడ్కరీ సహా కేంద్రమంత్రులందరూ తమతమ నివాసాల వద్ద జ్యోతులు వెలిగించి సంఘీభావం చాటారు. ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాడేపల్లిలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కొవ్వొత్తి వెలిగించారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కొవ్వొత్తి వెలిగించారు.