ఖమ్మంలో టీటీడీపీ భారీ సభ..బాబు స్కెచ్.!

-

మొత్తానికి తెలంగాణపై కూడా చంద్రబాబు కాస్త ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగాక ఆయన పూర్తిగా ఏపీకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది..ఆ పార్టీ నేతలు మెజారిటీ సంఖ్యలో బీఆర్ఎస్‌లోకి …ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఆఖరికి అధ్యక్షుడుగా పనిచేస్తూనే ఎల్ రమణ కూడా పార్టీని వదిలేశారు. దీంతో బక్కని నరసింహులుని అధ్యక్షుడుగా పెట్టారు. ఆయన ఏదో మొక్కుబడిగానే అధ్యక్షుడుగా పనిచేశారు.

ఇదే క్రమంలో టీడీపీలోకి కాసాని జ్ఞానేశ్వర్ ఎంట్రీ ఇచ్చారు..ఇక ఆయనకే టీడీపీ పగ్గాలు కూడా అప్పగించారు. కాసాని ఎంట్రీతో తెలంగాణలో టీడీపీ శ్రేణులు కాస్త యాక్టివ్ అయ్యాయి. కాసాని సైతం ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలని, శ్రేణులని యాక్టివ్ చేస్తూ వస్తున్నారు. ఇతర పార్టీల్లో ద్వితీయశ్రేణి నేతలని టీడీపీలోకి తీసుకుంటున్నారు. ఇలా తెలంగాణలో మళ్ళీ టీడీపీ కాస్త ఊపు తీసుకొచ్చేలా కాసాని ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ఖమ్మంలో భారీ సభకు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని పురస్కరించుకుని ఖమ్మంలో సభని నిర్వహించనున్నారు.

దీనికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఇక ఈ సభని భారీ స్థాయిలో సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. బుధవారం జరిగే సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో టీడీపీ పని అయిపోలేదని నిరూపించాలని చూస్తున్నారు. ఈ సభ తర్వాత టీడీపీకి మరింత ఊపు వస్తునని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

అటు చంద్రబాబు కూడా..ఇక్కడ టీడీపీ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నారు. ఇక ఖమ్మం తర్వాత ప్రతి జిల్లాలోనూ టీడీపీ సభలు నిర్వహింహడానికి కాసాని సిద్ధమవుతున్నారు. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న పాత టీడీపీ నేతలని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేలా బాబు..కాసానికి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఖమ్మం సభ తర్వాత తెలంగాణలో టీడీపీ బలం పెరుగుతుందేమో.

 

Read more RELATED
Recommended to you

Latest news