పీఆర్సీపై ఇవాళ సమావేశం నిర్వహించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి… ఏపీ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పిఆర్సీ పై చర్చ జరిగిందని.. పిఆర్సీ అంశం ప్రాసెస్ లో ఉందని పేర్కొన్నారు. పీఆర్సీ ఎంత శాతం ఇస్తారు అనే దానితో పాటు ఇతర అంశాలు చాలా ఉన్నాయని.. ఉన్నంతలో ఎంతో కొంత అధికంగా ఇవ్వాలని ఆలోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేదు…ఇది వాస్తవమని..రాజకీయ ప్రయోజనాల మాత్రమే చూస్తే వెంటనే పీఆర్సీ పై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. పీఆర్సీతో పాటు డీఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి… అన్ని అంశాలు చూడాల్సి ఉందని.. మొత్తం బరువు మీద పడకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్ధిక పరిస్థితి బాలన్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.
కావాలని పిఆర్సీ ఆలస్యం చెయ్యడం లేదు…ఆర్ధిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. రేపటి నుంచి అధికారులు ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చలు జరుపుతారని వెల్లడించారు. ఆయన వ్యాక్యలు చేస్తుంటే.. ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ.. అనుకున్నంత స్థాయిలో వచ్చే లా కనిపించడం లేదు.