కారులో సెగలు రప్పిస్తున్న కమలం..బండి ‘యాత్ర’ స్టార్ట్?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ప్రతిపక్షాలు చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పొచ్చు. అన్నివైపులా నుంచి కేసీఆర్‌ని రౌండప్ చేసేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్‌కు అధికారం దక్కకూడదనే దిశగా కాంగ్రెస్, బీజేపీలు ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ మరింత దూకుడుగా టీఆర్ఎస్‌పై ఎటాక్ చేస్తుంది. తమదైన శైలిలో బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…ప్రజా సమస్యలపై గళం విప్పి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వెళుతున్నారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం..కేంద్రం పెద్దల సపోర్ట్ ఉండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్..ధాన్యం అంశంపై పెద్ద ఎత్తున పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నిరుద్యోగుల కోసం దీక్షకు దిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్, నిరుద్యోగులని దారుణంగా మోసం చేశారని విమర్శిస్తున్నారు. నెల రోజుల్లోగా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని, నోటిఫికేషన్‌ ఇచ్చేదాకా తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని తీరుతామని అన్నారు.

అటు టీఆర్ఎస్ నుంచి కూడా బండిపై విమర్శలు వచ్చాయి. బండి దొంగ దీక్షలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. “దొంగదీక్ష ఎట్ల చేస్తరో మీ అయ్యనడుగు. మీ అయ్య ఖమ్మంలో దీక్ష చేసినప్పుడు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు నా దగ్గరుంది. బాత్‌రూంలోకి పోయి ఇడ్లీలు తిన్నడు” అంటూ బండి కౌంటర్ ఇచ్చారు.

ఇలా బీజేపీ-టీఆర్ఎస్‌ల మధ్య వార్ నడుస్తూనే ఉంది. అయితే రానున్న రోజుల్లో కూడా బండి మరింతగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే టీఆర్ఎస్‌ని మరింతగా ఇరుకున పెట్టవచ్చు. అదే సమయంలో బండి రెండవ విడత పాదయాత్ర మొదలుపెడితే ఇంకా పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాదయాత్ర ద్వారా ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండొచ్చు. అప్పుడు మరింతగా టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టవచ్చు. మరి బండి పాదయాత్ర ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news