తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదల కడుపు నింపుతుంది ప్రభుత్వం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. అయితే కొంత మంది మాత్రం ఆర్థిక స్తోమత అలాగే ఆస్తులు ఉన్నా కూడా అక్రమ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు.
భూములు, ఆస్తులు అలాగే వాహనాలు ఉండి కూడా పేదవారి గా చలామణి అవుతూ అక్రమంగా రేషన్ పొందుతున్నారు. ఇలాంటి వారి రేషన్ కార్డులు తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దీని కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా ఇప్పటికే రూపొందించారు. ఒక వ్యక్తికి 100 చదరపు మీటర్లలోకి ఫ్లాటు లేదా ఇల్లు, ఫోర్ వీలర్ లేదా ట్రాక్టర్, పట్టణాల్లో అయితే మూడు లక్షలు, అంతకు మించి ఆదాయం, గ్రామాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు అంతకన్నా ఎక్కువగా ఉంటే వారు అనర్హులుగా ప్రకటించనున్నారు.