Ram Charan: RC15 స్టోరి లీక్..ఈ సారి బొమ్మ అంతకు మించి!

-

RRR సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆయన నెక్స్ట్ చేస్తున్న ఫిల్మ్ ..ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన లీకుల బెడద కొనసాగుతూనే ఉంది.

RC15 సినిమా స్టిల్స్ తో పాటు రామ్ చరణ్ పోషిస్తున్న పాత్ర గురించి లీక్స్ వచ్చేశాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, రామ్ చరణ్ కు జోడీగా హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈపిక్చర్ ఉండబోతున్నదని, ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాక్.

తాజాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ప్రకారం..సినిమా స్టోరిలో భాగంగా రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారట. తండ్రీ తనయులుగా రామ్ చరణ్ కనిపించనున్నాడట. కొడుకు పాత్రకు షార్ట్ టెంపర్ ఉంటుందట. ట్రాఫిక్ పోలీసులతో గొడవ పడే సీన్ ను తాజాగా వైజాగ్ లో చిత్రీకరించారని సమాచారం. ఇక తండ్రి పాత్రలో రామ్ చరణ్ గ్రామీణ నేపథ్యంలో ఉండే రాజకీయ నాయకుడిగా ఉంటారట. ఈయన్ను వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా సీనియర్ హీరో శ్రీకాంత్ కనిపిస్తారని తెలుస్తోంది.

మొత్తంగా RC15 సినిమా ఎప్పుడూ సోషల్ మీడియాలో, వార్తల్లోనే ఉంటోంది. ఈ మూవీకి స్టోరి కార్తీక్ సుబ్బరాజ్ అందించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుందని టాక్. సునీల్, అంజలి, శ్రీకాంత్, కియారా అద్వానీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news