ఢిల్లీ : దేశంలో ఉప ఎన్నికల నిర్వాహణపై పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉప ఎన్నికల నిర్వహణపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను అడిగింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది.
దేశం లో ఎన్నికల నిర్వహణ పై ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలను విడుదల చేస్తామన్న ఎన్నికల కమీషన్… 5 రాష్ట్రాలు, పలు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మార్గదర్శకాలు, నిబంధనలు పై అభిప్రాయలు తెలియజేయాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఈ లేఖలో కోరింది. ఆగస్ట్ 30 లోగా ఆయా పార్టీలు అభిప్రాయలు తెలియజేయాలని కోరింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇక ఈ లేఖ తో ఈటల రాజేందర్ దిమ్మ తిరిగే షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ ప్రకారం… ఈ ఆగస్టు నెలలోనూ హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాదన్న మాట. హుజురాబాద్ ఉప ఎన్నికకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది. ఉప ఎన్నిక మరింత ఆలస్యం అయితే.. ఈటల రాజేందర్ కు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.