ఇప్పటి వరకు 15 ఎడిషన్ లను పూర్తి చేసుకున్న ఆసియా కప్ ఈ సంవత్సరంతో 16వ ఎడిషన్ స్టార్ట్ కానుంది. ఈ సీజన్ 2 సెప్టెంబర్ నుండి 17 సెప్టెంబర్ వరకు షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ లు జరగనున్నాయి. మాములుగా అయితే ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. కానీ ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండడం కారణంగా కేవలం ఇండియా ఆడే మ్యాచ్ లను మాత్రం యూఏఈ లో నిర్వహించాలని మొదట ACC నిర్ణయించింది. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందుకు టోర్నీలో పాల్గొంటున్న మిగిలిన జట్లు అంగీకరించలేదు. ఇక వేరే దారి లేక ఆసియ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయడానికి సిద్ధమైంది.
ఆసియా కప్ జరగబోయే దేశాన్ని మార్చింది, పాకిస్తాన్ లో కాకుండా శ్రీలంకలో ఈ టోర్నీ జరిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ రోజు మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం కానుంది.. ఈ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది. ఇది నిజంగా పాకిస్తాన్ కు షాక్ అని చెప్పాలి.