ప్రజా మద్ధతు ఏ మాత్రం తగ్గనివ్వకుండా చూసుకుంటూ…వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా జగన్..ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రాంలతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లాలని..గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టారు..ఆ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. ఇక ప్రజలకు జగన్ అంటేనే నమ్మకం ఉండనేలా..మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికి జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్లని అంటించారు. అలాగే జగనన్నే మా భవిష్యత్ పేరిట..జగన్ కు మద్ధతు ఇస్తూ..ఓ నెంబర్ ఇచ్చి..మిస్సడ్ కాల్స్ ఇచ్చే కార్యక్రమం చేశారు.
అయితే అందులో దాదాపు కోటి 60 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొంటే..దాదాపు కోటి 17 లక్షల కుటుంబాలు మద్ధతు ఇచ్చాయని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అలా ప్రజా మద్ధతు పెంచుకునేలా కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ..ఇప్పుడు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక గతంలో స్పందన అనే కార్యక్రమానికి కొనసాగింపే ఈ జగనన్నకు చెబుదాం..స్పందనలో ప్రజలు వారి సమస్యలపై ఫిర్యాదులు చేస్తే..జిల్లా కలెక్టరేట్‌లో సమస్యనిపరిష్కరించేవి..కానీ అనుకున్న మేరే సమస్యలు పరిష్కరించడంలో స్పందన పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే తెలుస్తోంది. కొంతమేర సమస్యలు మాత్రం పరిష్కారం అయ్యాయి.
అయితే ఇప్పుడు సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కారం అయ్యేలా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. 1902 నెంబర్ కు ఫోన్ చేస్తే..డైరక్ట్ సిఎం ఆఫీసుకు కనెక్ట్ అవుతుంది..వారే నేరుగా సమస్యలని స్వీకరించి..పరిష్కరించడానికి చూస్తారు. పరిష్కారం అయ్యే వరకు ఫిర్యాదు చేసిన వారికి అందుబాటులోనే ఉంటారు. సమస్యని పరిష్కరించి..ప్రభుత్వ పనితీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.
ఇలా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సమస్యలు వెల్లువల వచ్చేలా ఉన్నాయి..దీనివల్ల ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే పథకాలైతే వస్తున్నాయి గాని..స్థానికంగా రోడ్లు, డ్రైనేజ్ లు, తాగునీటి వసతులు అందజేయడంలో కాస్త విఫలమవుతున్నారు. దీంతో వాటిపై ఫిర్యాదులు పెరిగేలా ఉన్నాయి. ఇక కార్యక్రమం ఏదైనా ప్రజల్లో ఉండటమే వైసీపీ లక్ష్యంగా ఉంది.