చరణ్ – శంకర్ మూవీకి షాక్.. షూటింగ్ అడ్డుకున్న బిజెపి !

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం RC15. కార్తీక్ సుబ్బరాజ్ ఈ ఫిల్మ్ కు స్టోరి అందించగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్. రామ్ చరణ్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారని కొద్ది రోజుల నుంచి వార్తలొస్తున్నాయి.

రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా , టెంపర్ ఉన్న యువకుడిగా మూడు పాత్రల్లో రామ్ చరణ్ పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశారట. ఇది ఇలా ఉండగా ఈ సినిమా చిత్ర బృందానికి బిగ్ షాక్ తగిలింది. సరూర్ నగర్ వి.ఎం హోం లో రామ్ చరణ్ హీరోగా,శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ను స్థానిక బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అడ్డుకున్నారు. విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేల షూటింగ్లకు అనుమతి ఏ విధంగా ఇస్తారు అని ఆమె ప్రశ్నించారు.

విద్యాశాఖ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారని కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు.విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నాణ్యత మైన విద్యను అందించాల్సిన బాధ్యత మరిచి షూటింగ్ల పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖజానాలను నింపుకుంటుందని ఆమె ఆరోపించారు.వెంటనే రాంచరణ్ షూటింగు ఆపేయాలని ఆమె బిజెపి శ్రేనులతో కలిసి ధర్నా చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news