ద్రౌపది ముర్ము దేశ నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీలు సంతకాల సేకరణతో కూడిన లేఖను మంగళవారం పంపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్న నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థలతో దాడులు నిర్వహిస్తోంది. చేయని తప్పులకు తమపై బలవంతంగా రుద్దుతున్నారని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థలకు కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు లేఖలో ఆరోపించారు.

రాజకీయ ప్రత్యర్థలపై కేంద్రం ఈడీ, సీబీఐలను దాడులు నిర్వహిస్తోందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు, జీఎస్టీ పెంపుపై పార్లమెంట్‌లో చర్చలు జరపాలని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఇప్పటికే విపక్షాలు ఆందోళనలు చేపట్టినా.. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని విపక్షాలు కోరారు.