తెలంగాణ గవర్నర్ తమిళసై పై మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితుల కారణంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని, తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోరని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని మరిచినట్టున్నారని అన్నారు.
బిజెపి కార్యకర్తలు చేసే కామెంట్స్ కూడా గవర్నర్ నోటివెంట రావడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి. కెసిఆర్ రాజకీయాలు గవర్నర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ ఒక్క మాట చాలు గవర్నర్ బిజెపి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి అంటూ మండిపడ్డారు. బిజెపి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మీడియాలో అట్రాక్షన్ కోసం పోటీలు పడి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పై పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.