తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. యాసంగి కాలంలో వరి పంట వేయకూడదని.. ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాసంగి లో వరి వేయడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
యాసంగిలో వరి వేయొద్దన్న కేంద్రం.. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరించింది. దీనిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…యాసంగిలో వరి వేయద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని…దీంతో వరి పంట పై తెలంగాణకు నిరాశే మిగిలిందని వెల్లడించారు. ఈ ఏడాది లో ఎంత మేరకు ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పాలని కేంద్రాన్ని కోరామని.. అది కచ్చితంగా చెప్పే అవకాశం లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చెప్పారని.. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా కు చెప్పారు. కేంద్రం ఆదేశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి… వివరిస్తామని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.