మలక్‌పేట చందునాయక్ హత్యకేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గుడిసెల వివాదంతో పాటు చందునాయక్ హత్యకేసులో వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాల్పుల కేసులో ఇప్పటికే నిందితులను గుర్తించారు పోలీసులు. హత్యకేసులో FIRలో మొత్తం 9 మంది నిందితుల పేర్లు తెరపైకి వచ్చాయి.

రాజేష్‌తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రాచారి, యాదిరెడ్డి నిందితులుగా FIR నమోదు చేశారు. హత్యలో నేరుగా పాల్గొన్నది నలుగురు, సహకరించింది ఐదుగురు అని గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పది బృందాలతో గాలిస్తున్నారు.