#RC15 : శంకర్‌- చరణ్‌ మూవీ నుంచి బిగ్‌ అప్డేట్‌

మెగా పవర్‌ స్టార్‌ రాం చరణ్‌ మరియు ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబి నేషన్‌ లో భారీ బడ్జెట్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసందే. ఈ సినిమా రాం చరణ్‌ కెరీర్‌ లో 15 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ తమన్‌ సంగీతాన్ని అందిస్తుండగా… దిల్‌ రాజ్‌ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

పాన్‌ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. ఈ నెల 8 వ తేదీన అంటే రేపు ఈ సినిమా ను భారీ స్థాయి లో లాంచ్ చేయబోతుంది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా పూజ కార్య క్రమం రేపు జరుగునుందని… చిత్ర బృందం పోస్టర్‌ ద్వారా తెలిపింది. ఇక ఈ నేపథ్యం లో ఇవాళ హైదరాబాద్‌ చేరుకుంది హీరోయిన్‌ కియారా.