బిగ్ బాస్ 6: చలాకీ చంటి బిగ్ బాస్ ఎంట్రీ వెనుక ఇంత కథ నడిచిందా..?

-

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చలాకీ చంటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కువగా తన పంచ్ డైలాగ్లతో కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమాలలో కూడా కమెడియన్ గా రాణించారు. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా చేరిపోయాడు చలాకీ చంటి. ఇక ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ముందు చంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తాను బిగ్ బాస్ వెళ్లడానికి గల కారణాన్ని కూడా తెలియజేశారు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగానే చంటి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ వెళ్లాలని తాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇక నాగార్జున గారి నోటి నుంచి చంటి అనే పేరు వినాలని ఆశపడుతున్నాను. ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడు నాకు సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అంటూ చంటి ఇంటర్వ్యూ ద్వారా తెలిపాడు. అంతేకాదు బిగ్ బాస్ కార్యక్రమం కోసం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సమయంలో తాను ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాను అని తెలిపారు. మల్లెమాల వారు ఇచ్చే డబ్బులు తనకు ఏమాత్రం సరిపోవటం లేదని , ఇదేంటి అని అడిగితే నీ మొహానికి ఇదే ఎక్కువ అంటూ దారుణంగా అవమానించారని , ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా మాట్లాడడంతో ఆటిట్యూడ్ ,పొగరు, కోపిష్టి, ఈగో అంటూ ముద్ర కూడా వేశారు అంటూ ఆయన తెలిపారు.

అయితే ఇవన్నీ కూడా జబర్దస్త్ నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టడం కోసమే చేశారు అంటూ చంటి మల్లెమాల గురించి అలాగే జబర్దస్త్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్లు చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంచి మంచి స్కిట్లతో ప్రేక్షకులను అలరించే చంటి పై ఇలాంటి అబాండాలు వేయడం ఏమాత్రం సరికాదు అంటూ మల్లెమాలపై చంటి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు వెళ్లిపోయారు. ఇప్పుడు చంటి కూడా వెళ్లిపోవడంతో జబర్దస్త్ గతి అధోగతి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news