బిగ్ బాస్ 6: ఓటింగ్ విషయంలో చెలరేగిపోతున్న జబర్దస్త్ ఫైమా..!

-

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటివారం నామినేషన్స్ లో రేవంత్ తర్వాత ఫైమా కే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పవచ్చు.. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మొదటి వారంలోనే నామినేషన్స్ రౌండ్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదు ఈ నామినేషన్స్ లో అందరూ టాప్ సెలబ్రిటీలు ఉండడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక అందుకే ఇలా నామినేషన్స్ బుధవారం మొదలయ్యాయో లేదో అలా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే అనూహ్యంగా నామినేట్ అయిన ఏడుగురు సభ్యుల్లో ఫైమాకే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉందని సమాచారం..

జబర్దస్త్ , పటాస్ వంటి కార్యక్రమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఆఫర్ రాగానే వచ్చిన అవకాశాన్ని అందుకుంది. ఇక హౌస్ లో కామెడీ పంచాలని చూస్తోంది ఫైమా.. ఇక అయితే ఆ కామెడీ వల్ల కొంతమంది హర్ట్ అవుతున్నారని సమాచారం. ఇకపోతే నామినేషన్స్ లో ఉన్న ఫైమా ఓటింగ్ పర్సంటేజ్ లో మొదటి రెండు స్థానాలలో ఉంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఈమె పెద్దగా హౌస్ లో పర్ఫామెన్స్ చేసింది కూడా లేదు.. అయినా ఈమెకు ఓటింగ్ పర్సంటేజ్ చాలా వస్తుంది.. హౌస్ లో ఈమెకి కరెక్ట్ టాస్క్ ఒకటి పడి, అది గెలిస్తే మాత్రం ఫైమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని సమాచారం.

అయితే జబర్దస్త్ నుంచి వచ్చిన చంటి కూడా ఈ నామినేషన్స్ లో ఉండగా అతడికి ఓటింగ్స్ లో ఫైమా కన్నా తక్కువ రావడం గమనార్హం. మరి దీన్ని బట్టి చూస్తుంటే నామినేషన్ నుంచి రేవంత్, ఫైమా సేఫ్ జోన్ లోకి వెళ్ళబోతున్నారని స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news