బిగ్ బాస్ 6: నామినేషన్ లో అదిరిపోయే ట్విస్ట్.. షాక్ లో హౌస్ మేట్స్..!

-

బిగ్ బాస్ 6 ఎట్టకేలకు గ్రాండ్ గా ప్రారంభమైంది.. ఈ కార్యక్రమం ప్రారంభమై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే హౌస్ లో గొడవలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఇక అంతే కాదు ఎప్పుడు ఫస్ట్ డేనే నామినేషన్స్ పెట్టే బిగ్ బాస్ ఈసారి హౌస్ మేట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు. ఇక క్లాస్ , మాస్ , ట్రాష్ అని హౌస్ మేట్స్ ను డివైడ్ చేస్తూ వారితో చాలెంజ్ చేసి ఆడించాడు. ముఖ్యంగా రెండు రోజులు గేమ్స్ , టాస్క్ ఆడిన హౌస్ మేట్స్ ఎట్టకేలకు మూడో రోజు నామినేషన్స్ ముగించారు. ముఖ్యంగా క్లాస్ టీంలో నేహా చౌదరి ,ఆదిరెడ్డి, గీతూ రాయల్ ముగ్గురు సేఫ్ అవ్వగా , ఇక్కడ ట్రాష్ టీం లో అభినయశ్రీ , ఇనయ సుల్తానా, బాల ఆదిత్య మిగిలిపోయారు. ఇక ట్రాష్ లో ఉన్నవారు నేరుగా నామినేషన్స్ లోకి వెళ్తారు అని బిగ్ బాస్ వెల్లడించాడు.

ఇకపోతే ఒక్కొక్కరిని పిలుస్తూ ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. అంతేకాదు మెరీనా ఇంకా రోహిత్ ఇద్దరూ కపుల్ గానే ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరిని నామినేట్ చేస్తే ఇద్దరినీ చేసినట్లే అవుతుందని.. ఒకవేళ ఎలిమినేషన్ అయినా కూడా ఇద్దరు ఒకేసారి వెళ్లిపోతారని తెలిపాడు. దీంతో హౌస్ మెట్స్ ఈ కపుల్ ని నామినేట్ చేయడానికి ఇష్టపడలేదు. ఇక మాస్ టీమ్ లో ఉన్న రేవంత్ ని చాలామంది టార్గెట్ చేశారు. ఏకంగా ఏడు గురు హౌస్ మేట్స్ రేవంత్ ని నామినేట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ప్రస్తుతం రేవంత్ , చంటి, అభినయ శ్రీ, శ్రీ సత్య, ఫైమా, ఇనయ సుల్తానా, ఆరోహి రావు నామినేషన్ లోకి వచ్చేసారు . వాసంతి కృష్ణన్ మాత్రం కేవలం రెండు ఓట్లు రావడంతో సేఫ్ అవ్వడం జరిగింది. ఇంకో ఓటు పడి ఉంటే తను కూడా ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చేది.

ఇక లాస్ట్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ వల్ల బాలాదిత్యా నామినేషన్స్ నుంచి సురక్షితం అయ్యాడు. మరి ఈ వారం ఈ 6 గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి . ఇకపోతే ఇప్పటికే రేవంత్ , ఫైమా ఓటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉండడంతో వీరిద్దరు కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news