బిగ్ బాస్: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మెరీనా ఎంత పారితోషితం తీసుకుందంటే..?

-

బిగ్ బాస్ తెలుగులో ఆరవ సీజన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫైనల్ కి చేరుకున్న ఈ సీజన్ నుంచి ఊహించని విధంగా జంటగా వచ్చిన మెరీనా – రోహిత్ లలో మెరీనా ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యకరమని చెప్పవచ్చు. ప్రతిరోజు హౌస్ లో చలాకీగా కనిపిస్తూ ఉంటూ జనాల దృష్టిని బాగా ఆకర్షిస్తూ ఉండాలి. కానీ మెరీనా ఈ విషయంలో కాస్త తడబడింది. ఎక్కువ సమయం ఈమె వంటగదికే తన సమయాన్ని పరిమితం చేసింది. మదర్ ఇండియా అనే పేరు తెచ్చుకుంది. కానీ గేమ్ కి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది.

చాలా సౌమ్యంగా ఉంటూ ఎవరితో గొడవలు పెట్టుకోకుండా.. ఎవరు ఈమెను నిందించినా సరే అవేవీ మనసులో పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. దీంతో ఈమెపై జనాలలో మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది. కానీ ఈమె ఆట తీరు చూసి ఓట్లు వేయడం తగ్గించారు. మెరీనా హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు తన భర్త రోహిత్ తో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. మొదట వీరిద్దరిని ఒకే కంటెస్టెంట్ గా పరిగణించిన బిగ్బాస్ ఆ తర్వాత ఎలిమినేషన్ సంఖ్య పెరిగిన తర్వాత వీరిని విడదీసి ఎవరి ఆట వారిదే అన్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో మెరీనా, రోహిత్ వారి సొంత ఆటల్లో ఓట్లు అందుకునే ప్రయత్నం చేశారు.

11 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మెరీనా అందరితో చాలా స్నేహంగానే మెలిగింది. అయితే సౌమ్యంగా ఉంటే ఎప్పుడు హౌస్ నుంచి తీసేస్తారో తెలియదు. ఈ క్రమంలోని బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె 11వ వారం ఎలిమినేట్ అయ్యింది. అయితే కొంతమంది శ్రీ సత్య వాళ్లే మెరీనాను ఎలిమినేట్ చేశారంటూ వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఇదిలా వుండగా.. మరి 11 వారాలకు గాను ఆమె ఎంత పారితోషకం తీసుకున్నారు అనే విషయానికి వస్తే.. వారానికి 35వేల రూపాయలు చొప్పున 11 వారాలకు గాను 3 లక్షల 8వేల రూపాయలను ఆమె పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version